![]() |
![]() |

తెలుగు సినిమాకి డ్యాన్స్ పరిచయం చేసింది అక్కినేని నాగేశ్వరరావు. ఆయన మనవడు, నాగార్జున మేనల్లుడు సుశాంత్ మంచి డ్యాన్సర్. 'అల... వైకుంఠపురములో' సినిమాలోని 'రాములో రాములా' పాటలో తనకంటే సుశాంత్ బాగా డ్యాన్స్ చేశాడని అల్లు అర్జున్ చెప్పారు. ఇప్పటివరకు పాటల కోసం సెట్స్ లేదా లొకేషన్లలో డ్యాన్స్ చేసిన సుశాంత్, 'ఇచట వాహనములు నిలుపరాదు' సినిమాలో ఓ పాట కోసం తొలిసారి పబ్లిక్‌లో డ్యాన్స్ చేశాడు. అప్పుడు బాగా సిగ్గుపడ్డానని చెప్పుకొచ్చాడు.
కరోనా నేపథ్యంలో ఆర్నెల్లు చిత్రీకరణకు విరామం ఇచ్చిన 'ఇచట వాహనములు నిలుపరాదు' యూనిట్, ఇటీవల చిత్రీకరణ పునఃప్రారంభించింది. కెమెరా ముందు నటీనటులు మాస్కులు వేసుకోవడం కుదరదు కనుక ఆ సమయంలో మాస్కులు ధరించడం లేదనీ, మిగతా జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నామని సుశాంత్ తెలిపారు. సెట్ లో అందరూ బాధ్యతగా వ్యవహరిస్తున్నామని అన్నారు.
పబ్లిక్‌లో డ్యాన్స్ చేయడం గురించి సుశాంత్ మాట్లాడుతూ "అందరూ డ్యాన్స్ చూస్తుండగా డ్యాన్స్ చేయడానికి సిగ్గుపడ్డాను. పైగా, వర్షం కూడా వస్తోంది. నా పరిస్థితి ఊహించుకోండి. మొదట పబ్లిక్ ని డ్యాన్స్ చూడటానికి అనుమతించకూడదని అనుకున్నా. కానీ, ఆ తరవాత మెంటల్ గా ప్రిపేర్ అయ్యి చేశా" అన్నారు. ఇదొక కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్. సినిమాలో మోటార్ సైకిల్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందట.
![]() |
![]() |